ఇప్పటి పెద్ద హీరోలు అప్పట్లో నన్ను చూడటం కోసం వెయిట్ చేసేవారు: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ

  • ఆ వీధిని రాజశ్రీ స్ట్రీట్ అనేవారు
  • మాకు ఇంపాల కారు ఉండేది 
  • వీధి చివర్లో వాళ్లు కాచుకుని వుండేవారన్న రాజశ్రీ
తెలుగులో రాజశ్రీ ఎక్కువగా జానపద సినిమాలు చేశారు. ఆమె నాట్యానికి అప్పట్లో అభిమానులు ఫిదా అయ్యేవారు. అలాంటి రాజశ్రీ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఇప్పుడు టాప్ లో వున్న హీరోలంతా అప్పట్లో నన్ను చూడటానికి చెన్నైలో మా వీధికి వచ్చేవారు.

ఆ వీధి చివరన నుంచుని నేను ఎప్పుడు బయటికి వస్తానా అని ఎదురుచూసేవారు. అప్పట్లో నాకు 'ఇంపాలా' కారు ఉండేది. నేను కారు దిగుతున్నా .. ఎక్కుతున్నా 'రాజశ్రీ .. రాజశ్రీ' అని చెప్పుకునేవారు. ఆ వీధిలో మాకు ఇళ్లు .. షాపులు .. హోటల్ ఉండేవి. అందువల్లనే రాజశ్రీ ఆ స్ట్రీట్ అంతా కొనేసింది అని చెప్పుకునేవారు. ఆ తరువాత అదే స్ట్రీట్ లో చిరంజీవిగారు .. విజయనిర్మలగారు .. విజయశాంతి .. సుమలత ఉండేవారు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Rajasri
Senior Heroine
Tollywood

More Telugu News